విజయ్ పీఠం ఎక్కాలంటే కాంగ్రెస్ మద్దతిస్తే సరిపోదు: డీఎంకే నేత కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారన్న ఇళంగోవన్
- ఏ పార్టీకి సరైన మద్దతు రాకపోతే మళ్లీ కొత్తగా ఎన్నికలకు వెళ్లాల్సి రావొచ్చని వ్యాఖ్య
- ఎన్నికల్లో డీఎంకే ఓడిపోవడంపై ఇళంగోవన్ ఆందోళన
తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే మద్దతిస్తే సరిపోదని డీఎంకే పార్టీ నేత ఇళంగోవన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, కానీ టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మొత్తం 118 మంది ఎమ్మెల్యేలు అవసరమని చెప్పారు. అన్నాడీఎంకే కనుక టీవీకే పార్టీకి మద్దతివ్వకుంటే, ఏ పార్టీకి సరైన మద్దతు రాక హంగ్ ఏర్పడితే మళ్లీ కొత్తగా ఎన్నికలకు వెళ్లాల్సి రావొచ్చని అన్నారు.
టీవీకేకు మద్దతుపై అన్నాడీఎంకేకు బీజేపీ ఎలాంటి సూచనలు చేసిందో తమకు తెలియదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తమ పార్టీ డీఎంకే ఓడిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏదో పొరపాటు జరిగిందని, అదేమిటో పరిశీలిస్తున్నామని అన్నారు. అధికారంలోకి రావడం మాత్రమే తమ పార్టీ అజెండా కాదని, కొన్ని దశాబ్దాలుగా తమ పార్టీ అధికారంలోకి ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.